
హైదరాబాద్: కరో్నా వ్యాక్సిన్ సెంటర్‌ను విజిట్ చేయడానికి హైదరాబాద్‌కు ఈ నెల 9న విదేశీ ప్రతినిధులు రానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దాదాపు 80 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ‘మన దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి జరుగుతున్న రీసెర్చ్, డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌ను తెలుసుకోవడానికి 80 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్‌లు, అంబాసిడర్లు రానున్నారు’ అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, చీఫ్ ఆఫ్ ప్రోటోకాల్ నగేశ్ సింగ్‌తోపాటు మరికొందరు తెలంగాణ సీనియర్ అధికారులతో కలసి నిర్వహించిన మీటింగ్‌లో చర్చించారు. విదేశాంగ ప్రతినిధులు భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కోసం పని చేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్‌తోపాటు ఈ-బయోలాజికల్స్‌ను సందర్శించనున్నారని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తెలిపారు. రీసెంట్‌గా వ్యాక్సిన్ అభివృద్ధిని తెలుసుకోవడానికి ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే.