జీహెచ్ఎంసీ ఆఫీసులోకి పామును వదిలిన బాధితుడు

జీహెచ్ఎంసీ ఆఫీసులోకి పామును వదిలిన బాధితుడు

హైదరాబాద్​లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు పడుస్తున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఇళ్లలోకి మురుగు. వరద నీరు వస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. విష సర్పాలు తిరుగుతున్నా... అధికారులు పట్టించుకోవట్లేదని విసుగెత్తిన ఓ వ్యక్తి ఏకంగా పామునే ప్రభుత్వ కార్యాలయానికి తీసుకొచ్చాడు. 

ఈ ఘటన అల్వాల్​లో జరిగింది. స్థానికంగా నివసిస్తున్న సంపత్​కుమార్​ అనే యువకుడు వర్షాలతో తాము పడుతున్న ఇబ్బందులను ఆఫీసర్లకు చెప్పాడు. సమస్య పరిష్కరించాలని ఎన్ని సార్లు విన్నవించినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. 

ALSO READ :తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. ఉద్రిక్తత

ఆరు గంటలు దాటినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓపిక నశించి.. ఓ ఇంట్లోకి వచ్చిన పామును అల్వాల్​ జీహెచ్​ఎంసీ వార్డు ఆఫీసుకు తీసుకెళ్లాడు. అధికారుల టేబుల్​పై పాము విడిచిపెట్టి నిరసన తెలిపాడు. ఒక్క సారిగా జరిగిన ఈ ఘటనతో భయాందోళనకు గురైన అధికారులు బయటకి పరుగులు తీశారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది.