టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్–ఫ్లాప్‌లను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. విభిన్న కథనాలను ఎంచుకుంటూ, ప్రతీసారి డిఫరెంట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే, ప్రయోగాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయి విజయాలు మాత్రం అందుకోవడంలో వెనుకబడుతున్నాడు.
2024లో విడుదలైన ‘గామి’, ‘మెకానిక్ రాఖీ’ సినిమాలు, అలాగే 2025లో వచ్చిన ‘లైలా’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా, వెనక్కి తగ్గని విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కోసం 2026 సంవత్సరాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సాలిడ్ హిట్ కొట్టడానికి 2026 ఇయర్ని టార్గెట్గా మలుచుకున్నారు విశ్వక్.
- ALSO READ | Nilakanta న్యూ ఇయర్ బ్లాస్ట్: ‘నీలకంఠ’ పేరుకే చిన్న సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్
అందులో భాగంగా మొదటగా ‘జాతి రత్నాలు’ లాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న KV అనుదీప్ చిత్రంతో ముందుకు వస్తున్నాడు. యూనిక్ స్టోరీ లైన్ తో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా 'ఫంకీ' ఫిబ్రవరి 13న రానుంది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్.. కొత్త సంవత్సరం కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నాడని సమాచారం.
‘పిండం’ మూవీ డైరెక్టర్ సాయి కిరణ్ దైదా తన కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. పొలిటికల్ డ్రామా ఓరియెంటెండ్ కాన్సెప్ట్తో "సింహాసనం.. దాని కింది భాగం రక్తపు ధారలు" తో ఫస్ట్ లుక్ పోస్టర్ పంచుకున్నారు. పిండం సినిమాను నిర్మించిన కలాహి మీడియానే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2026 జనవరి 1న సాయంత్రం 5 గంటలకు అనౌన్స్‌మెంట్ టీజర్‌ను లాంచ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Politics is Personal.@Kalaahi_Media #ProductionNo2
— Kalaahi Media (@Kalaahi_Media) December 31, 2025
Announcement Teaser on January 1st 2026, 5 PM.
Wishing everyone a powerful and prosperous New Year!! pic.twitter.com/eNAmHD1lgJ
ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇది నిజమైతే, విశ్వక్ సేన్ నుంచి మరోసారి డిఫెరెంట్ అండ్ ఇంటెన్స్ పాత్రను ఆశించవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే, గ్యాంగ్స్ అఫ్ గోదారి వంటి పొలిటికల్ విలేజ్ డ్రాప్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.
