Nilakanta న్యూ ఇయర్ బ్లాస్ట్: ‘నీలకంఠ’ పేరుకే చిన్న సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్

Nilakanta న్యూ ఇయర్ బ్లాస్ట్: ‘నీలకంఠ’ పేరుకే చిన్న సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్

బాల నటుడిగా వెండితెరపై మెరిసి, ఇప్పుడు హీరోగా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు మాస్టర్ మహేంద్రన్. ఆయన కథానాయకుడిగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘నీలకంఠ’ (Nilakanta). 2026 జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘సినిమానే తన ప్రపంచమని, తెలుగు ప్రేక్షకులు అందిస్తున్న మద్దతు ఎప్పటికీ మరువలేనని భావోద్వేగానికి లోనయ్యారు. చాలామంది కొత్త హీరోలు వస్తున్నారు, పోటీ ఎక్కువగా ఉందని అంటుంటారు. కానీ నా లక్ష్యం ఒక్కటే.. మిమ్మల్ని అలరించడం. దర్శకుడు రాకేష్ చెప్పిన కథ, నిర్మాతలిద్దరి ప్యాషన్ చూసి ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది” అని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు రాకేష్ మాధవన్ మాట్లాడుతూ.. "ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక గెలిచిన వ్యక్తి కథ అని, థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఆ గెలుపు మీదే అని ప్రేక్షకులు ఫీల్ అవుతారని చెప్పారు. యాక్షన్, లవ్, ఎమోషన్ వంటి కమర్షియల్ హంగులతో పాటు సమాజానికి  విద్య ఎంత ముఖ్యమనే గ్రిప్పింగ్ పాయింట్‌ను ఈ చిత్రంలో చర్చించారు. నాయుడుపేట పరిసర ప్రాంతాల్లోని సహజ సిద్ధమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని" చిత్ర బృందం తెలిపింది. 

ALSO READ : న్యూ ఇయర్ 2026 OTT స్పెషల్

నిర్మాతలు మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ తమ నటనతో సినిమాకు గ్లామర్, వెయిటేజ్ తీసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జనవరి 2న విడుదల కాబోతున్న "నీలకంఠ" మాస్టర్ మహేంద్రన్‌ను ఒక స్టార్‌గా నిలబెడుతుందని టాలీవుడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.