పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? ప్రభుత్వం కీలక నిర్ణయం: 100mg కంటే ఎక్కువ వాడకంపై నిషేధం!

పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా?  ప్రభుత్వం కీలక నిర్ణయం: 100mg కంటే ఎక్కువ వాడకంపై నిషేధం!

మన దేశంలో నొప్పి నివారణకు ఎక్కువగా వాడే మందుల్లో నిమెసులైడ్(Nimesulide) ఒకటి. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 100mg కంటే ఎక్కువ మోతాదు ఉండే ట్యాబ్లేట్ల తయారీ, అమ్మకాలను నిషేధించింది.

నిమెసులైడ్ అనేది నొప్పిని, జ్వరాన్ని తగ్గించే మందు (NSAID). కానీ దీనివల్ల కొన్ని తీవ్రమైన రిస్కులు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. ఈ మందులను ఎక్కువ మోతాదులో వాడితే లివర్ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంకా   కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే చాలా ఏళ్ల క్రితమే 12 ఏళ్ల లోపు పిల్లలకు దీనిని వాడకూడదని నిషేధం విధించారు.  అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది. 

 ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ మందులను అనుమతించలేదు. ఇకపై మార్కెట్లో 100mg మోతాదుగల నిమెసులైడ్ మాత్రలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతకంటే ఎక్కువ పవర్ లేదా మోతాదు  ఉన్నవి అమ్మకూడదు.

మందుల కంపెనీలు అధిక మోతాదు ఉన్న స్టాక్‌ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి బదులుగా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇతర నొప్పి నివారణ మందులను వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.