న్యూ ఇయర్ పార్టీకి బయటి ఫుడ్స్ తో జాగ్రత్త: అదంతా ఆరోగ్యం కాదు ఫుడ్ పాయిజన్..

న్యూ ఇయర్ పార్టీకి బయటి ఫుడ్స్ తో జాగ్రత్త: అదంతా ఆరోగ్యం కాదు ఫుడ్ పాయిజన్..

కొత్త సంవత్సరం వేడుకలు సందడితో జరుగుతున్నాయి... మందు, విందులతో కోలాహలం కనిపిస్తోంది... ఇంత హ్యాపీ మూడ్లో శ్రమ ఎందుకని ఫుడ్ ఆర్డర్ పెడుతుంటారు కొందరు... హోటళ్లకు వెళ్తుంటారు ఇంకొందరు... అందంగా డెకరేషన్లు చేసిన వంటలు... ఆవురావురుమంటూ తింటారు. కానీ, అవి ఎంత వరకు సేఫ్?

అర్బన్ ఇండియాలో కొత్త కొత్త వంటకాలకు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. ఆ ఆదరణ కారణంగా చెఫ్ లు మామూలు వంటకాలకు రకరకాల ఫ్లేవర్ లు కలుపుతూ కొత్త పేర్లు పెడుతున్నారు. పైగా వాటికి కోటింగ్లు చేస్తూ అందంగా డెకరేషన్లు చేస్తున్నారు. అదే ఇప్పుడు జనాల లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మారాయి. అయితే ఈ 'వెల్ డ్రెస్డ్' వంటకాలు ఆరోగ్యానికి అంతమంచివి కావని వైద్యులు వారిస్తున్నారు. గుండె జబ్బులు పెరిగిపోవడానికి ఇవే కారణమవుతున్నాయట. అందుకే నాన్ నేటివ్ ఫుడ్ కు దూరంగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.


గ్లూటెన్ ఫ్రీ అంక్ ఫుడ్ 
గ్లూటెన్ అనేది గోధుమలు, బార్లీ, తృణ ధాన్యాల్లో ఉండే ప్రోటీన్. అయితే వైద్యులు మాత్రం కొందరు పేషెంట్లను వీటికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయినప్పటికీ చాలా మంది అదేం పట్టించుకోరు. కానీ, గ్లూటెన్ ఫ్రీ ఫుడ్లోనూ మిగతా వాటిలో లాగే కొవ్వు పదార్థాలు ఉంటాయి. తక్కువ ఫైబర్, ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ALSO READ : న్యూ ఇయర్ పార్టీ హ్యాంగోవర్ వేధిస్తోందా ?

ఎనర్జీ డ్రింక్
సాధారణంగా  ఎనర్జీ డ్రింక్ స్పోర్ట్స్ డ్రింక్ గా వ్యవహరిస్తుంటారు. ఎలక్ట్రోలైట్స్, షుగర్తో వీటిని తయారు చేస్తారు. ఇవి అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే కుర్చీలో కూర్చుని గంటల తరబడి పని చేసే వాళ్లకు వీటితో పని ఉండదు. తక్కువ వర్కవుట్లు, వ్యాయమాలు చేసే వాళ్లకు కూడా అవసరం లేదు. అయినప్పటికీ కొందరు అదే పనిగా స్పోర్ట్స్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇది మంచి అలవాటు కాదని అంటున్నారు.

సెల్ఫ్ సలాడ్
చాలా మంది సలాడ్ కి రకరకాల ఫ్లేవర్లను కలుపుతారు. సలాడ్ డ్రెస్సింగ్ కోసం షుగర్, కూరగాయల ఆయిల్, కృత్రిమమైన రసాయనాలను మిక్స్ చేస్తారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే బయటకు వెళ్లినప్పుడు సలాడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అయితే సొంతంగా సలాడ్ చేసుకోవచ్చు. సహజసిద్ధమైన తేనె, నిమ్మకాయ రసం ఉపయోగించడం మంచిది.

కృత్రిమ వెన్న 
రసాయనాలతో వనస్పతిని కొన్ని కంపెనీలు తయారు చేస్తుంటాయి. సహజసిద్ధమైన వెన్న కంటే ఇది ఎంతో ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. 'ది మింగమ్ హార్ట్ స్టడీ చేపట్టిన సర్వేలో గుండె జబ్బులు పెరిగిపోవడానికి కృత్రిమ వెన్న  ఒక కారణమని తేలింది.

షుగర్తో జాగ్రత్త
హెల్దీ ఫుడ్లో తీపి కూడా ఒక భాగమే. సాధారణంగా షుగర్ స్థానంలో కార్న్ సిరప్, ఎవగే పదార్థాలను కలుపుతుంటారు. కానీ, వాటిల్లో ఫ్రక్టోజ్  శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటి స్థానంలో మామూలు చక్కెరను ఉపయోగించడమే బెటర్.