అడ్వెంచర్ హబ్‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ! గ్రేటర్లో 50 పర్యాటక ప్రదేశాల గుర్తింపు

అడ్వెంచర్ హబ్‌‌‌‌‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ! గ్రేటర్లో 50 పర్యాటక ప్రదేశాల గుర్తింపు
  • రాష్ట్ర పర్యాటకశాఖ సన్నాహాలు
  •     వాటిలో గోల్కొండ, చార్మినార్, కుతుబ్ షా టవర్స్, వండర్​ లా,  సాలార్ జంగ్​ మ్యూజియం 
  •     పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను చారిత్రక, సాంస్కృతిక కేంద్రంగా, అడ్వెంచర్ హబ్‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా  ‘కస్టమైజ్డ్ టూరిజం’ లేదా అడ్వెంచర్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నది. ఇందుకోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చుట్టూ ఉన్న 50 ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను గుర్తించింది.  పర్యాటకులను ఆకర్షించేలా సాహస క్రీడలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తున్నది. 

ఇంటి వద్దకే వాహనం సౌకర్యం..

కస్టమైజ్డ్​ టూరిజంలో పర్యాటకుల సౌలభ్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది టూర్ బుక్ చేసుకుంటే.. వారి ఇంటి వద్దకే వాహనాలను పంపించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం టూరిజం పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్​లో సందర్శించే పర్యాటక ప్రాంతాలను ఆన్​లైన్​లో ఎంపిక చేసుకుంటే ఇంటి వద్దకు వాహనాన్ని పంపిస్తారు. ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి సందర్శన పూర్తయిన తర్వాత ఇంటి వద్ద వదిలి వెళ్తారు. దీనిద్వారా పర్యాటకులు, కుటుంబాలకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నారు

.'హైదరాబాద్ సిటీ టూర్' ప్యాకేజ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా చార్మినార్, గోల్కొండ, సాలార్‌‌‌‌‌‌‌‌జంగ్ మ్యూజియం, లాడ్​బజార్ షాపింగ్‌‌‌‌‌‌‌‌, వండర్​లా, కుతుబ్​షా టవర్స్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను కవర్ చేయను న్నారు. అంతేకాకుండా, రాత్రివేళ టూర్స్‌‌‌‌‌‌‌‌లో గో ల్కొండ లైట్ అండ్ సౌండ్ షో, చారిత్రక, సాంస్కృతి క ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు.  పర్యాటకుల ఆహ్లా దం కోసం రాక్ క్లైమ్బింగ్, పారాగ్లైడింగ్ వంటి అ డ్వెంచర్ యాక్టివిటీలతో వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఈ టూర్‌‌‌‌‌‌‌‌లో చారిత్రక స్మారకాలు,  అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యూజియం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం..

పర్యాటకశాఖ అభివృద్ధితోపాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. శాఖకు ఆదాయమార్గాలను సైతం అన్వేషిస్తున్నాం. అందులో భాగంగానే కస్టమైస్డ్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతున్నాం. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది టూర్ కు ప్లాన్ చేసుకొని.. ఆ వివరాలను టూరిజం పోర్టల్ లో బుక్ చేసుకుంటే వారి ఇంటి వద్దకు వాహనం పంపిస్తాం. 

తొలుత గ్రేటర్ హైదరాబాద్ లో అమలు చేస్తున్నాం. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. ప్రజలకు అందుబాటులోకి టూరిజాన్ని తీసుకెళ్తాం. ప్యాకేజీని బట్టి ధరలను టూరిజం పోర్టల్ లో పొందుపరుస్తాం. ఇప్పటికే 50 ప్రాంతాలను గ్రేటర్ లో గుర్తించాం.
- క్రాంతి, టూరిజం ఎండీ