కొత్త సర్కారైనా బిల్లులు చెల్లించాలి

కొత్త సర్కారైనా బిల్లులు చెల్లించాలి
  • బల్దియా కాంట్రాక్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి

ఖైరతాబాద్, వెలుగు: గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, కొత్త సర్కార్ అయినా  బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని  గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్​కార్పొరేషన్​ కాంట్రాక్టర్స్​ అసోసియేషన్ కోరింది. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో  అసోసియేషన్​అధ్యక్షుడు ఎ.రామకృష్ణరెడ్డి, జనరల్​సెక్రటరీ ఎం.సురేందర్​సింగ్ ​మాట్లాడుతూ.. గతేడాది మార్చి నుంచి  ఇప్పటివరకు రూ. 1,200 కోట్లు  బిల్లులు రావాలన్నారు.

మరో వెయ్యి కోట్ల పనులు ప్రాసెస్​లో ఉన్నాయని, కాంట్రాక్ట్ పనులపై ఆధారపడి 2.50 లక్షల మంది ఉన్నారని చెప్పారు. అప్పులు చేసి నిర్వహించిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోగా ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. బల్దియాలో కాంట్రాక్ట్​పనులు నిర్వహించేవారు మొత్తం 3,500 మంది ఉన్నారని, తామంతా చిన్న కాంట్రాక్టర్లమన్నారు. ఈ సమావేశంలో ట్రెజరర్​ మహ్మద్ ​నిజాముద్దీన్​, ఆరిఫ్​ అహ్మద్​,మధుసూదన్​, వసంత్​కుమార్​,రామచంద్రరెడ్డి,చంద్రశేఖరరెడ్డి, ప్రసాద్​నాయక్, సైదులు పాల్గొన్నారు.​