టీఎస్ఆర్టీసీ బస్సులో 16.5 కిలోల గంజాయి పట్టివేత

టీఎస్ఆర్టీసీ బస్సులో 16.5 కిలోల గంజాయి పట్టివేత
  • అలంపూర్ దాటాక పంచలింగాల చెక్ పోస్టులో పట్టుకున్న పోలీసులు
  • నలుగురిని అరెస్టు చేసిన కర్నూలు సెబ్ పోలీసులు

కర్నూలు: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్ప, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎస్.ఈ.బి) అడిషనల్ ఎస్పీ  గౌతమిసాలి,  ఎక్సైజ్ అసిస్టెంట్  కమిషనర్ శ్రీలత ఆధ్వర్యంలో శనివారం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద  వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న రెండు టీఎస్ఆర్టీసీ బస్సులను ఆపి తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన బాక్సుల్లో ఏముందని వాటిని తీసుకుని వస్తున్న నలుగురిని ప్రశ్నించగా తడబడ్డారు. అనుమానం రావడంతో తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది. రెండు బస్సుల్లో నలుగురు నిందితులు మొత్తం  16.5 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ రెండు కేసులను సెబ్ సీఐ ఎన్.లక్ష్మి దుర్గయ్య కర్నూలు తాలూకా పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌‌పై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ చాంపియన్‌‌షిప్ ఫైనల్‌‌‌‌లో భారత్

1500 కోట్ల చీటింగ్.. 10 లక్షల మందిని ముంచారు

కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ.. మోసాలు చేస్తున్న మాజీ రంజీ ప్లేయర్ అరెస్ట్

100 కోట్ల వ్యూస్ సాధించిన ఐటం సాంగ్