హైదరాబాద్ BHEL గేట్లు మూసివేత : కొత్త టైమింగ్స్ పెట్టిన అధికారులు

హైదరాబాద్ BHEL గేట్లు మూసివేత : కొత్త టైమింగ్స్ పెట్టిన అధికారులు

ఇండియా, పాకిస్తాన్ హై టెన్షన్ క్రమంలో.. దేశ వ్యాప్తంగా అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా ఉన్న భద్రత, ఇతర కీలక కంపెనీల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్న BHEL కంపెనీకి కొత్త టైమింగ్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు నిరంతరం తెరిచే ఉంటే మెయిన్ గేట్లను.. ఇక నుంచి మూసివేస్తున్నారు. BHEL కంపెనీ చుట్టూ ఆరు గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి కంపెనీ ఉద్యోగులే కాకుండా.. స్థానిక ప్రజలు, ఇతరులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక నుంచి అలాంటి రాకపోకలపై ఆంక్షలు విధించింది BHEL.

హైదరాబాద్ లింగంపల్లిలోని BHEL గేట్ల మూసివేత శుక్రవారం (మే 09) నుంచి అమలులోకి వస్తుంది. సెక్కూరిటీ కారణాల రీత్యా గేట్లు మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. గేట్ల మూసివేత టైమింగ్స్ ఇలా ఉన్నాయి:

1. మెయిన్ చెక్ పోస్ట్:     రాత్రి 11.30 నుంచి ఉదయం 5.00 గంటల వరకు మూసి వేయడం జరుగుతుంది. 
2. శ్రీనివాస్ థియేటర్ గేట్:     సెక్యూరిటీ కారణాలతో పూర్తిగా మూసివేయడం జరిగింది. 
3. HIG (ZPHS) గేట్:     ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు
                              సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి ఉంటుంది. 
4.  HIG (సుందరవనం పార్కు) గేట్: ఓపెన్ చేసి ఉంటుంది.
5.LIG గేట్ :        ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు
          సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి ఉంటుంది.                             
6. MAC సొసైటీ రోడ్ గేట్:     పూర్తిగా మూసివేయబడింది.
7. CISF బరాక్ రోడ్ గేట్ :     పూర్తిగా మూసివేయబడింది.
8. MIG (నెహ్రూ పార్క్ రోడ్ )గేట్ : ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు
                                                  సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి ఉంటుంది.
9. MIG (బుధవారం మార్కె్ట్ రోడ్ ) గేట్: పూర్తిగా మూసివేయబడింది. 

భారత్ పాక్ మధ్య తీవ్రతరం అవుతున్న యుద్ధ వాతావరణం రీత్యా గేట్లు మూసివేస్తున్నట్లు బీహెచ్ఈఎల్ ప్రకటించింది. అయితే అంబులెన్స్, ఫైర్ర సర్వీస్ వంటి ఎమర్జెన్సీ సేవలకు అనుమతి ఉంటుంది. లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఉద్యోగులు, నివాసం ఉంటున్న స్థానికులు ఈ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రకటన వెలువరించింది.