
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) ఆర్టిజన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్, విశాఖపట్టణం, రాణిపేట్, తిరుచిరాపల్లి(తమిళనాడు), వారణాసి, జగదీశ్పూర్, ఝాన్సీ(ఉత్తరప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), హరిద్వార్(ఉత్తరాఖండ్), భోపాల్ (మధ్యప్రదేశ్) యూనిట్లలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 08.
పోస్టుల సంఖ్య : 515
పోస్టులు : ఫిట్టర్ 176, వెల్డర్ 97, టర్నర్ 51, ఎలక్ట్రీషియన్ 65, మెషినిస్ట్ 104, ఫౌండ్రీమెన్ 04, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 18.
ఎలిజిబిలిటీ : పోస్టును అనుసరించి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ)/ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(ఎన్టీసీ) కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడులో నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్(ఎన్ఏసీ) సైతం కలిగి ఉండాలి. ఐటీఐ/ ఎన్టీసీతోపాటు ఎన్ఏసీలో జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ALSO READ : Production Jobs: HLL లో ప్రొడక్షన్ విభాగంలో పోస్టులు భర్తీ
వయోపరిమితి: జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏండ్లు, ఓబీసీ(ఎన్సీఎల్) అభ్యర్థులకు 30 ఏండ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 32 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 16.
లాస్ట్ డేట్: ఆగస్టు 08.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 1072. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్సర్వీస్ మెన్లకు రూ.472.
ఎగ్జామ్ డేట్: 2025, సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నది. కచ్చితమైన పరీక్ష తేదీని అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేసే సమయంలో వెల్లడిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రెండంచెల సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. స్టేజ్–Iలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్(సీబీఈ), స్టేజ్–IIలో స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రెండింట్లోనూ ఉత్తీర్ణులైన అభ్యర్థులను మాత్రమే తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
శాలరీ : మినిమమ్ పే స్కేల్ రూ. 29,500 – 65,000.
పూర్తి వివరాలకు careers.bhel.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ : సంబంధిత ట్రేడుల్లోని అంశాలపై ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో సాధించిన మార్కులు, సంబంధిత యూనిట్లో ఖాళీల సంఖ్య ఆధారంగా1: 5 నిష్పత్తిలో అభ్యర్థులను స్కిల్ టెస్టుకు ఎంపిక చేస్తారు.