
హైదరాబాద్ : ఆషాఢ మాస బోనాలకు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లో అట్టహాసంగా నిర్వహించే బోనాల ఉత్సవాల నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం బోనాల తేదీలు ఖరారు చేశారు.
ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. జూలై 17న ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూలై 24న లష్కర్ బోనాలు, 25 ఘటాల ఊరేగింపు జరగనుంది. జూలై 28న గోల్కొండలో చివరి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ముగియనున్నాయి.