
హైదరాబాద్ శివారు అబ్దులాపూర్మెట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా భార్యభర్తలను లారీ కొట్టింది. దీంతో భార్యభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతులను తుఫ్రాన్పేట్కు చెందిన దంపతులు వెంకటేష్, లక్ష్మీగా గుర్తించారు పోలీసులు.
ALSO READ | పాప చనిపోయాక ఏమీ తెలీనట్టు ఆసుపత్రికి.. కోరుట్ల చిన్నారి పిన్ని మమత వీడియో బయటకి !
పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ హైవే రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.