
జులై 10న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సెక్రటేరియట్ లోని ఆరో ఫ్లోర్ లో మధ్నాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్ల ఖరారు, రాజీవ్ యువ వికాసం స్కీమ్, బనకచర్ల అడ్డుకోవడంపై స్టేట్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి, అడ్మిషన్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్లు, మెడికల్ కాలేజీల స్థితిగతులు, డ్రగ్స్ నియంత్రణ, సన్నబియ్యం పంపిణీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది.
ALSO READ : వీసా గడువు అయిపోయినా హైదరాబాద్లో అక్రమంగా ఉంటూ ఏం పనులివి..!
ప్రతినెలా 2 సార్లు షెడ్యూల్ ప్రకారం కేబినెట్ భేటీ కావాలని గత కేబినెట్ లోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. తర్వాతి మంత్రివర్గ భేటీ ఎప్పుడు ఉంటుందనేది ముందే షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఎజెండాలు ప్రిపేర్ అవుతాయి. దీంతో మంత్రులు కూడా తమ షెడ్యూల్ను ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పటి దాకా టైమ్, సందర్భం, వెసులుబాటును బట్టి కేబినెట్ సమావేశాలు నిర్వహించారు.