Mega157: మెగాస్టార్‌తో వెంకటేశ్ ధమాకా ఖాయం: 'గ్యాంగ్ లీడర్' తరహా చిరుని చూడబోతున్నాం – అనిల్ రావిపూడి!

Mega157: మెగాస్టార్‌తో వెంకటేశ్ ధమాకా ఖాయం: 'గ్యాంగ్ లీడర్' తరహా చిరుని చూడబోతున్నాం – అనిల్ రావిపూడి!

మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) అభిమానులకు దర్శకుడు అనిల్ రావిపూడి ( Anil Ravipudi) అదిరిపోయే శుభవార్త అందించారు. తన  తదుపరి ' Mega157'  మూవీలో నటీనటుల ఎవరు ఉండబోతున్నారు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించారు.  ఈ భారీ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ( Venkatesh )  కీలక పాత్రలో నటిస్తున్నారని ఆయన ధృవీకరించారు. ఈ సినిమాలో  వెంకీ భాగం కావడం ఒక సర్ ప్రైజ్ లాంటిదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పుడే పూర్తిగా రివీల్ చేయదలుచుకోలేదని  ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. ఆయన షూటింగ్‌లో అడుగుపెట్టినప్పుడు, అది ప్రేక్షకులకు ఒక పెద్ద పండగ అవుతుందని పేర్కొన్నారు. 

ALSO READ | Rajinikanth: 'కూలీ' గ్లోబల్ సునామీకి సిద్ధం: రజినీకాంత్ - ఆమిర్ ఖాన్ కాంబో 100 దేశాల్లో విడుదల!

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  అనూహ్యమైన ఈ కలయిక మెగా అభిమానుల్లో, అలాగే దగ్గుబాటి అభిమానుల్లో ఆనందానికి హద్దులు లేదు. చిరంజీవి, వెంకటేశ్ ఒకే తెరపై కనిపించడం అనేది చాలా ఏళ్ళ తర్వాత జరుగుతున్న అద్భుతం కానుందని కామెంట్లు చేస్తున్నారు.  ఇది బ్లాక్ బ్లాస్టర్ పక్కా అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల సునామీ చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

'గ్యాంగ్ లీడర్' తరహా చిరంజీవిని చూడబోతున్నాం! 
ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర గురించి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక ఆసక్తికరమైన క్లూ ఇచ్చారు. ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్రతో ప్రేక్షకులు చాలా బలంగా కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా ఆయన 'గ్యాంగ్ లీడర్' 'ఘరానా మొగుడు' వంటి కల్ట్ క్లాసిక్స్‌ను ఇష్టపడిన వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇది నిజంగా ఒక సర్ ప్రైజ్ అవుతుంది – ఊహించని విధంగా, కానీ భావోద్వేగంగా ఉంటుంది అని  వెల్లడించారు. ఇది చిరంజీవి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఆయన పాత సినిమాల మాస్, క్లాస్ మేళవింపు ఈ చిత్రంలో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే చిత్రంగా ఉండబోతోందని చెప్పుకొచ్చారు.

అనిల్ మార్క్ కామెడీ, యాక్షన్ మేళవింపు!
ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. అనిల్ రావిపూడి తన సినిమాల శైలి గురించి మాట్లాడుతూ, “నా చిత్రాలలో ఎక్కువ భాగం జంటల చుట్టూ తిరుగుతాయి, అది F2 అయినా లేదా సంక్రాంతికి వస్తున్నాం అయినా సరే. ఆ స్పేస్ లో ఎంతో సంఘర్షణ, భావోద్వేగాలు ఉంటాయి. భార్యాభర్తల డైనమిక్ ఈ సినిమాలో కూడా ఉంటుంది, కానీ ఒక సరికొత్త విధానంలో. ఇది కేవలం కామెడీ కాదు – దాదాపు 70% హాస్యం ఉంటుంది, మిగిలినది డ్రామా. చిరంజీవి గారి స్టైల్‌తో నా స్టైల్‌ను కలిపి, ముఖ్యంగా సిట్యుయేషనల్ కామెడీలో, భారీ స్థాయి, యాక్షన్ కూడా ఉంటుంది అని వివరించారు.

మ్యాజిక్ సృష్టిస్తారా?
అనిల్ రావిపూడి తన చిత్రాల్లో కామెడీని, ఎమోషన్‌ను సమపాళ్లలో మిళితం చేయడంలో దిట్టగా పేరు పొందారు. ఇప్పుడు చిరంజీవి వంటి మెగాస్టార్‌తో కలిసి, వెంకటేశ్ వంటి స్టార్ నటుడి చేరికతో, తన మార్క్ కామెడీతో పాటు భారీ యాక్షన్ అంశాలను కూడా జోడించి, ప్రేక్షకులకు సరికొత్త, గుర్తుండిపోయే అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.  వెంకటేశ్ చేరికతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  మరి ఈ ముగ్గురి అద్భుతమైన కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనం రేపుతుందో చూడాలి. సినీ ప్రియులంతా ఈ ప్రాజెక్ట్ ( Chiru 157 ) కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.