
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. జులై 7న ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా.. ఖేలో ఇండియా గేమ్స్, 40వ నేషనల్ గేమ్స్, ఏవైనా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మాండవీయను విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ . ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు సీఎం రేవంత్. 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యం ఇస్తే రెండు ఈ వెంట్లను తెలంగాణలో నిర్వహించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు . జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం.
ALSO READ : ఉమ్మడి 10 జిల్లాలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్లు వీళ్లే..
ఈ సమావేశం అనంతరం కేంద్రమంత్రులు సీఆర్ పాటిల్, గజేంద్ర సింగ్ లో తో భేటీ కానున్నారు రేవంత్. బనకచర్లతో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించననున్నారు సీఎం. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తిరిగి జులై 8న రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం.