
సంస్థాగత నిర్మాణంపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించిన టీ పీసీసీ.. ఇపుడు ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ ఛార్జ్ లను నియమిస్తూ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం వారితో జూమ్ మీటింగ్ నిర్వహించిన మహేశ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వారికి దిశానిర్దేశం చేశారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేయాలన్నారు. ఇందు కోసం వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు.
ALSO READ : ఖబడ్దార్ కేటీఆర్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రోడ్లమీద తిరగనియ్యం: బండిసంజయ్
10 జిల్లాలకు ఇన్ చార్జీలు
- ఖమ్మం: వంశీ చందర్ రెడ్డి
- నల్గొండ: సంపత్ కుమార్
- వరంగల్: అడ్లూరి లక్ష్మణ్
- మెదక్ : పొన్నం ప్రభాకర్
- హైదరాబాద్ : జగ్గారెడ్డి
- మహబూబ్ నగర్: కుసుమ కుమార్
- ఆదిలాబాద్ : అనిల్ యాదవ్
- కరీంనగర్ : అద్దంకి దయాకర్
- నిజామాబాద్ : అజ్మత్ హుస్సేన్
- రంగారెడ్డి : శివసేనా రెడ్డి