
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్–2025 ఫలితాలను వెల్లడించారు. TG ICET ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలక్రిష్టా రెడ్డి విడుదల చేశారు. ఐసెట్లో 90.83 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మహాత్మాగాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో గతనెల 8,9 తేదీల్లో ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 71,757 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా, 64,938 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను https://tgche.ac.in వెబ్ సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు.
జూన్ 8,9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 షిఫ్ట్ల్లో ఆన్లైన్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. నాలుగు విడతలుగా జరగిన ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. పరీక్ష ప్రాథమిక- కీ జూన్ 21న విడుదల చేశారు. అభ్యంతరాలకు జూన్ 22 నుంచి జూన్ 26 వరకు అవకాశం కల్పించారు. జూలై 7న ఫలితాలను ప్రకటించారు.