సికింద్రాబాద్ వస్తుండగా ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఆ తర్వాత ఏమైందంటే..

సికింద్రాబాద్ వస్తుండగా ఎద్దును ఢీ కొట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఆ తర్వాత ఏమైందంటే..

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు పెద్ద ప్రమాదమే తప్పింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి పెను ప్రమాదం తప్పింది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అప్ లైన్లో 428/11 వద్ద వందే భారత్ రైలు ప్రమాదవశాత్తూ ఎద్దును ఢీ కొట్టింది. ఈ ఘటనతో కొన్ని నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది.

స్పందించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పట్టాలపై పడి ఉన్న ఎద్దును తొలగించారు. ఈ ఘటనలో రైలు ఇంజన్ ముందు భాగం(క్యాటిల్ గాడ్) విరిగింది. ఉదయం 5.45 గంటలకు విశాఖలో ప్రారంభమై.. మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌కు ఈ రైలు చేరుకుంటుంది. అదే రోజు సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ALSO READ | ప్రకాశం బ్యారేజిలో దూకి ప్రైవేట్ స్కూల్ డైరెక్టర్ ఆత్మహత్య..

ఈ రైలు మధ్యలో వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది. చైర్ కార్ చార్జీలు సికింద్రాబాద్​నుంచి విశాఖపట్నానికి రూ. 1,665గా... విశాఖ నుంచి సికింద్రాబాద్కు 1,720 రూపాయలు కావడం గమనార్హం. విశాఖ నుంచి సికింద్రాబాద్కు వారంలో ఆరు రోజులు వందేభారత్ ట్రైన్ రాకపోకలు సాగిస్తుంది. వందే భారత్ ట్రైన్ ఉదయం విశాఖలో బయల్దేరి మధ్నాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటది. తిరిగి సికింద్రాబాద్లో బయల్దేరి రాత్రికి విశాఖ చేరుకుంటది.