
గాడ్జెట్స్ అండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ OnePlus సమ్మర్ లాంచ్ ఈవెంట్కి కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. ఈ ఈవెంట్ రేపు అంటే జూలై 8న నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ సందర్భంగా కంపెనీ కొత్త Nord సిరీస్‌లోని OnePlus Nord 5 ఇంకా Nord CE 5లను ఆవిష్కరించనుంది. ఈ ఫోన్లు కెమెరా టెక్నాలజీ, మంచి పవర్ ఫుల్ ప్రాసెసర్లు, గొప్ప బ్యాటరీ పనితీరుతో సహా చాల అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. అయితే ఈ లాంచ్‌కు ముందే OnePlus Nord 5, Nord CE 5 ధరలు లీక్ అయ్యాయి.
ఇక OnePlus Nord 5, Nord CE 5 ధరల విషయానికి వస్తే ధరలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, OnePlus Nord 5 ధర రూ. 30,000 నుండి రూ. 35,000 మధ్య ఉండవచ్చని అంచనా. అలాగే Nord CE 5 ధర కొంచెం తక్కువకు అంటే దాదాపు రూ.25,000 వరకు ఉండొచ్చు. అధికారిక ప్రకటన తర్వాత ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని చెబుతున్నారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్లు ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్ లైన్లో కూడా లభిస్తాయి.
OnePlus Nord 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు చూస్తే ఇందులో Snapdragon 8s Gen 3 చిప్‌సెట్ ఉంటుంది, ఇది Snapdragon 8-సిరీస్ ప్రాసెసర్‌తో వస్తున్న మొట్టమొదటి Nord ఫోన్ అవుతుంది. LPDDR5X RAMతో మంచి పర్ఫార్మెన్స్, సామర్థ్యం రెండింటినీ మెరుగుపరిచే అవకాశం ఉంది.
50MP సోనీ LYT-700 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, ఆటోఫోకస్‌తో 50MP JN5 ఫ్రంట్ కెమెరా మంచి వీడియో కాల్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రెండు కెమెరాలు 4K 60fps వీడియో క్యాప్చరింగ్‌ను అందిస్తాయి. దీనికి 6.83-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.
ALSO READ : దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్.. కోటి 60 లక్షలతో నిర్మాణం..
OnePlus Nord CE 5 స్పెసిఫికేషన్లు ఇంకా ఫీచర్ల చూస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 6.77-అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే, డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తుందని భావిస్తున్నారు, వీటిలో 50MP ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ ఇంకా వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.