
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సీసీఎస్ లో ప్రక్షాళన జరుగుతోంది. 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు పడింది. 12మంది సీఐలు, నలుగరు ఎస్సైలను బదిలీ చేస్తూ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్వర్తులు జారీ చేశారు. వీరు వెంటనే మల్టీజోన్ 2 కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ACP ఉమామహేశ్వరరావు , CI సుధాకర్ లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.