పెళ్లి దావత్‌ల ఎఫెక్ట్.. కొండెక్కిన చికెన్ ధరలు

పెళ్లి దావత్‌ల ఎఫెక్ట్.. కొండెక్కిన చికెన్ ధరలు

వారాంతంలో చికెన్‌ ముక్కలు తింటూ కుటుంబంతో సరదాగా గడిపే సామాన్య నగర వాసులను భయపెట్టే కథనమిది. ఇన్నాళ్లు నాలుగు ముక్కలు నోట్లు వేసుకున్న వారు ఇకపైనా రెండు మక్కలతో సర్దు కోవాల్సిందే. కార్తిక మాసం పుణ్యమా అని గతనెల అందుబాటులో ఉన్న చికెన్‌ ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. హైదరాబాద్‌లో చికెన్ ధరలు గత మూడు వారాల్లో 15 శాతానికి పైగా పెరిగాయి.

హైదరాబాద్‌లో నవంబర్ 27న లైవ్‌లో కిలో రూ.106 ఉన్న చికెన్ ధరలు నేడు రూ.126కి పెరిగాయి. అదే స్కిన్ లెస్ అయితే గతంలో రూ.170 ఉండగా, ఇప్పుడు రూ.200 చేరుకుంది. ఈ పెరుగుదలకు  కార్తిక మాసం ముగియడం ఒక కారణమైతే, దేశంలో పెళ్లిళ్లు హడావుడి మొదలవడం మరో కారణం. వివాహ వేడుకల్లో దావత్‌లకు చికెన్‌ తప్పనిసరి కావడంతో డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చికెన్ రేట్లు పెరిగాయి. 

చికెన్ ధరలు పెరుగుదల(గత మూడు వారాల్లో..) 

చికెన్ రకం  నవంబర్ 27    డిసెంబర్ 11    డిసెంబర్ 18

లైవ్            రూ. 105              రూ. 97                రూ. 122

విత్ స్కిన్     రూ. 154            రూ. 171              రూ. 177

స్కిన్ లెస్      రూ. 175           రూ. 160              రూ. 201

బోన్ లెస్    రూ. 320           రూ. 300               రూ. 360