వైరస్ వర్రీ: కరోనా టెన్షన్ లో సిటిజన్స్

వైరస్ వర్రీ: కరోనా టెన్షన్ లో సిటిజన్స్

మానసిక స్థితిపై ఎఫెక్ట్
ఆర్థిక ఇబ్బందులూ కారణం
అనవసర భయాలతో సూసైడ్ దాకా..
పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలంటున్న సైకాలజిస్టులు

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో దెబ్బతిన్న జనంపై కరోనా అనేక రూపాల్లో ప్రభావం చూపుతోంది. ఆర్థికంగా, సామాజికంగా లేనిపోని భయాలు, ఒత్తిళ్ల‌తో చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కొందరు సూసైడ్ దాకా పోతున్నారు. జాబ్ పోయిందనో, బిజినెస్ లాస్ అయిందనో ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా సింప్టమ్స్ ఉన్నవాళ్లు, పాజిటివ్ వచ్చి హాస్పిటల్, హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లూ టెన్షన్ పడుతున్నారు.
హుస్సేన్ సాగర్ కి 113 మంది…
ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ట్యాంక్ బండ్ పై113 మంది సూసైడ్ అటెంప్ట్ చేయగా.. లేక్ పోలీసులు గమనించడంతో బతికిపోయా రు. ఒక్క జులై నెలలోనే 45 మంది హుస్సేన్ సాగర్ లో ఆత్మహత్యకు యత్నించగా, ఒకరు చనిపోయారు. అలా మానసికంగా ఇబ్బంది పడుతున్న వారిలో జాబ్ పోయినవాళ్లు, ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులు, కూలీలు, కరోనా సింప్టమ్స్ తో  యాంగ్జెటీలో ఉన్నవారే ఉన్నారు. పోలీసులు కాపాడి కౌన్సెల్సింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. భవిష్యత్ ఎలాగో అన్న ఆందోళనలో ఎక్కువ మంది ఉంటున్నట్లు లేక్ పీఎస్ ఇన్ స్పెక్ట‌ర్ ధనలక్ష్మి తెలిపారు.
25శాతం యువతే…
కరోనాతో సైకలాజికల్ ఇంపాక్ట్ , ట్రీట్మెంట్ వెల్ బీయింగ్ పై జర్నల్ ఆఫ్ సైకియాట్రీ అండ్ సైకియాట్రిక్ డిజార్డ‌ర్ గత నెల 29న
స్టడీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ తో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోఉండే జనాల మానసిక పరి
స్థితిని సైకాలజిస్టులు అంచనా వేశారు. ఈ స్టడీలో 16 –25 ఏండ్ల వయస్సు యువతను 33శాతం తీసుకోగా.. తీవ్రమైన యాంగ్జ‌ టీలో ఉన్నట్లు15 శాతం మంది, స్ట్రెస్ తో బాధపడుతున్నట్లు 10శాతం మంది తెలిపారు. మిగిలిన వారిలోనూ కరోనా క్రైసిస్ ను ఎలా ఎదుర్కొవాలనే అయోమయంలో ఎక్కువమంది ఉన్నారని, అలాంటి మానసిక ఆందోళనే తీవ్రమైన ఆలోచనలకు కారణమవుతోందని రిపోర్ట్ లో పేర్కొన్నారు.
ధైర్యమే మందు
మందు లేని కరోనాకు మానసిక ధృడత్వమే మందుగా పని చేస్తుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇలాంటి టైమ్లో ఒంటరిగా
ఉండాల్సిన పరిస్థితులు, సామాజికంగా దూరమైతున్నామనే భావన మరింత ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. పాజిటివ్
వచ్చినా ధైర్యంగా ఉండి మెడికేషన్ తోపాటు మెడిటేషన్, నచ్చిన అలవాట్లతో ఐసోలేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా దూరం పెట్టాలని చెప్తున్నారు.

ఎస్ఆర్ న‌గర్ కు చెందిన హౌస్ వైఫ్ జులైలో సూసైడ్ చేసుకునేందుకు హుస్సేన్ సాగర్ కు వచ్చింది. లేక్ పోలీసులు గమనించి కాపాడారు. ‘‘కరోనాతో ఉపాధి లేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. మా ఆయన జీతం సరిపోక గొడవలయితున్నయి. అందుకే సూసైడ్ చేసుకోవాలనుకున్నా’’నంటూ ఆమె కంట తడి పెట్టింది.

ఖైరతాబాద్ వృద్ధ దంపతులు వారం పాటు జలుబు, దగ్గు , జ్వరంతో బాధపడ్డా రు. సొంతవాళ్లు దూరంగా ఉండడంతో మరింత
టెన్షన్ చెందారు. కరోనా వచ్చిందేమోనని భయపడి సూసైడ్ చేసుకున్నారు. మాదాపూర్ కు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి కుప్పకూలిపోయాడు. అప్పటికే ఉద్యోగం పోయిందనే డిప్రెషన్ లో ఉన్నాడు. కరోనాతో మూడ్రోజులు భయపడ్డా ..ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తో కోలుకున్నాడు.

ఫ్యామిలీ,సొసైటీ సపోర్ట్ అవసరం
కరోనా పరిస్థితుల్లో తెలియకుండానే మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. సొసైటీ, పరిసరాల ప్రభావం కూడా ఉద్వేగానికి గురిచేస్తుంది. అలాంటి టైమ్లో ఫ్యామిలీ మెంబర్స్, సొసైటీ సపోర్ట్ అవసరం. ఎవరికివారుగా మానసికంగా ధృడంగా మారేందుకు ట్రై చేయాలి. అవసరమైతే సైకాలజికల్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇటీవల నేను డీల్ చేసిన కేసుల్లో నడి వయస్సు వారే ఎక్కువగా ఇన్ సెక్యూరిటీ, ట్రెస్, డిప్రెషన్ తో బాధపడుతున్నారు. – హుమ్లా గురు, సైకాలజిస్ట్

మ‌రిన్ని వార్త‌ల కోసం..