హైదరాబాద్ సిటీలో బైక్ డ్రైవ్ చేసేవాళ్లకు సిటీ సీపీ సజ్జనార్ వార్నింగ్

హైదరాబాద్ సిటీలో బైక్ డ్రైవ్ చేసేవాళ్లకు సిటీ సీపీ సజ్జనార్ వార్నింగ్
  • డ్రైవింగ్​ చేస్తూ ఇయర్ ​ఫోన్స్​ పెట్టుకుంటే జైలుకే.. 
  • వీడియోలు చూసినా చర్యలు  తప్పవ్
  • ఎక్స్లో సిటీ సీపీ సజ్జనార్ వార్నింగ్​

హైదరాబాద్ సిటీ , వెలుగు: నగరంలో చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెవిలో ఇయర్​ఫోన్స్​పెట్టుకుని పాటలు వినడం, కాల్స్​మాట్లాడడం చేస్తున్నారని, వీడియోలు కూడా చూస్తున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయమై ఆయన ఎక్స్​లో ట్వీట్​ చేశారు. సిటీలో ఆటోలు, క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు డ్రైవింగ్​చేస్తున్నప్పుడు చెవిలో ఇయర్​ఫోన్స్​పెట్టుకుని నిమిషాల తరబడి మాట్లాడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.

మన మెదడు మల్టీ టాస్కింగ్​ ( ఒకేసారి రెండు పనులు చేయడం) చేస్తున్నప్పుడు తికమక పడి ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఇయర్‌‌‌‌‌‌‌‌ ఫోన్స్ డ్రైవర్ దృష్టిని మరల్చి, ప్రమాదాలను పెంచుతాయన్నారు. డ్రైవర్లు రూల్స్​ పాటించకపోతే జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమస్యలుంటే నేరుగా తనకు మెజేస్​ చేయాలని సీపీ సజ్జనార్​ సిటీ ప్రజలకు తెలిపారు. తన ట్విట్టర్​ ఐడీ  x.com/SajjanarVCకు డైరెక్ట్​గా టెక్స్ట్​ చేయాలని సూచించారు.