మాడిఫైడ్​ సైలెన్సర్లు తుక్కు.. తుక్కు

మాడిఫైడ్​ సైలెన్సర్లు తుక్కు.. తుక్కు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  మాడిఫైడ్ ​సైలెన్సర్లతో సౌండ్ పొల్యూషన్‌‌‌‌ సృష్టిస్తున్న వాహనదారులపై సిటీ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి మాడిఫైడ్​ సైలెన్సర్లను అమర్చిన బైకులను సీజ్ చేస్తున్నారు. నెల రోజులుగా స్పెషల్‌‌‌‌ డ్రైవ్​ నిర్వహించి 1,910 కేసులు నమోదు చేశారు.1000 బైకులకు మాడిఫైడ్​సైలెన్సర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని సోమవారం బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో రోడ్డురోలర్​తో తుక్కు చేశారు.