మటన్ బిర్యానీలో బొద్దింక.. మూసేసిన మెరిడియన్ హోటల్ పేరుతో ఆన్ లైన్ ఆర్డర్లు..!

మటన్ బిర్యానీలో బొద్దింక.. మూసేసిన మెరిడియన్ హోటల్ పేరుతో ఆన్ లైన్ ఆర్డర్లు..!

హైదరాబాద్ సిటీ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్.. కొన్ని రోజుల క్రితం ఈ హోటల్ లో.. కస్టమర్ పై రెస్టారెంట్ సిబ్బంది దాడి చేయగా చనిపోయాడు. దీంతో రెస్టారెంట్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ మెరిడియన్ రెస్టారెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ వివరాలు ఏంటీ.. ఆ ట్విస్ట్ ఏంటీ అనేది చూద్దాం...

నికిల్ అనే వ్యక్తి.. తన ఎక్స్ అకౌంట్ నుంచి ఓ పోస్టు చేశాడు. పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాను.. ఆ బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఆ రెస్టారెంట్ వంట గదిని పరిశీలించండి అంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కు.. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ కు ట్యాగ్ చేశాడు నికిల్. 

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసింది కదా అని.. ఫిజికల్ గా అంటే.. రెస్టారెంట్ అయితే మూసివేశారు కానీ.. ఆన్ లైన్ డెలివరీలు మాత్రం నడుస్తున్నాయనేది నికిల్ పోస్టుతో వెలుగులోకి వచ్చింది. స్విగ్గీ, జొమాటో నుంచి ఆన్ లైన్ ఆర్డర్లు తీసుకుంటూ.. బయట నుంచి మెరిడియన్ బ్రాండ్ పేరుతో.. బయట వంట గది ఏర్పాటు చేసి.. డెలివరీలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read :- వాట్సాప్ ఛానెల్లో మోదీకి 5 మిలియన్ల ఫాలోవర్స్

 

నికిల్ ఎక్స్ అకౌంట్ నుంచి పోస్టు అయిన ఫొటోలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేప్టీ అధికారులు స్పందించారు. మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసి ఉంది. అయినా మీ సమాచారంపై విచారణ చేస్తాం అని తెలిపారు.