టెన్త్ స్టూడెంట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి..పాస్ పర్సంటేజ్ పెంచేలా చర్యలు  : కలెక్టర్​ అనుదీప్ 

 టెన్త్ స్టూడెంట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టండి..పాస్ పర్సంటేజ్ పెంచేలా చర్యలు  : కలెక్టర్​ అనుదీప్ 
  • హైదరాబాద్ కలెక్టర్​ అనుదీప్ 

హైదరాబాద్​, వెలుగు : జిల్లాలో విద్యాశాఖపై హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​ ప్రత్యేక దృష్టిపెట్టారు.  పరీక్షలు సమీపిస్తుండగా పాస్​ పర్సెంటేజ్​పెంచేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని స్కూళ్లను సందర్శిస్తూ విద్యార్థులకు పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తున్నారు. గతేడాది టెన్త్ లో  హైదరాబాద్​ జిల్లా రాష్ట్రంలో 28వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర పరిపాలనకు  కేంద్రమైన హైదరాబాద్ జిల్లా పది ఫలితాల్లో వెనకపడటంపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈసారి వందశాతం పాస్​ పర్సెంటేజ్​ను పెంచేందుకు కలెక్టర్ ఫోకస్ చేశారు.  

హైదరాబాద్​ జిల్లా  కొన్నేండ్లుగా చివరి స్థానం, లేదా చివరి నుంచి రెండు, మూడు స్థానాలకు పరిమితం అవుతూ వస్తుంది. దీంతో కలెక్టర్​ ఈసారి  ప్రత్యేక దృష్టి సారించారు. పాస్​ పర్సంటేజ్​ను పెంచడానికి తగు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, డీఐవోలు, అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎగ్జామ్స్ కు  నెల రోజుల సమయం ఉండగా ప్లానింగ్​తో పిల్లలను చదివించాలని

రివిజన్​ చేయించడంతో పాటు స్లిప్​ టెస్టులు రెగ్యులర్ గా నిర్వహించేలా అధికారులను ఆదేశిస్తున్నారు. జిల్లాలోని వివిధ స్కూళ్లను సందర్శిస్తూ సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి ఆదేశిస్తున్నారు. పిల్లలతో ఇంటరాక్ట్​ అవుతూ.. ఏ సబ్జెక్ట్ ఎలా చదివితే సులువుగా అర్థం చేసుకోవచ్చో వివరించి చెబుతున్నారు.