హైదరాబాద్, వెలుగు: కాచిగూడ గవర్నమెంట్జూనియర్కాలేజీ, స్కూల్లో సోమవారం చేపట్టిన స్వచ్ఛదనం-– పచ్చదనం కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. చెత్తను ట్రాక్టర్ లో వేశారు. స్కూలు, కాలేజీలో చేపట్టాల్సిన పనుల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో 100 శాతం హాజరు ఉండాలని, పదో తరగతి స్టూడెంట్ల పాస్పర్సంటేజ్పెరగాలని టీచర్లకు సూచించారు. కార్పొరేటర్ ఉమా రమేశ్‌యాదవ్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ ఓ.ఒడ్డెన్న, బల్దియా డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఎంఓహెచ్ హేమలత, కాలేజీ ప్రిన్సిపాల్ చిరంజీవి పాల్గొన్నారు.
