
అన్నవరంలోని ఓ లాడ్జీలో హైదరాబాద్ కు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన పవన్, ధనలక్ష్మి దంపతులు అన్నవరం వచ్చి ఓ లాడ్జ్ లో బస చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతానికి చెందిన పవన్ హైదరాబాద్ లో ఓ ట్రావెల్స్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఘటనా స్థలిలో సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పవన్ ఆర్థిక సమస్యల్లో ఉన్నాడని.. ఆత్మహత్యకు అదే కారణంగా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.