జూబ్లీహిల్స్ లో ‘ఆపరేషన్ రోప్’ స్పెషల్ డ్రైవ్

 జూబ్లీహిల్స్ లో ‘ఆపరేషన్ రోప్’ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ లో  ‘ఆపరేషన్ రోప్’ స్పెషల్ డ్రైవ్ మొదలైంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 లో సీపీ సివి ఆనంద్,  ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగ నాథ్  ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఆపరేషన్ రోప్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని చెప్పారు. కరోనా తో నగరంలో వాహనాల సంఖ్య పెరిగిందన్నారు. చాలామంది సొంత వాహనాలు వియోగిస్తున్నారని..దీంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ కఠిన తరం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి  పోలీసులకు సహకరించాలని సూచించారు. ఆపరేషన్ రోప్ తో వాహనాల రద్దీని తగ్గిస్తామన్నారు. ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పిస్తామని..రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్లు వేస్తామని హెచ్చరించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారులలో అవగాహన కల్పిస్తామన్నారు. 

మొదటగా వాహనదారులలో పరివర్తన రావాలని..అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. అందుకే చాలాన్లు వెంటనే విధించడం లేదన్నారు. ఎవరైతే ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడతారో వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  స్టాప్ లైన్ దాటితే 100 రూపాయాల ఫైన్, ఫ్రీ  లెఫ్ట్ బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. ఫుట్ ఫాత్ లను ఆక్రమించినా... వాహనాలకు అడ్డంగా  పార్క్ చేసినా జరిమానా విధిస్తామని తెలిపారు.