సౌండ్ చేశారో.. సైలెన్సర్ నలిగిపోద్ది...

సౌండ్ చేశారో.. సైలెన్సర్ నలిగిపోద్ది...

సిటీలో సౌండ్ పొల్యూషన్ చేసే  సైలెన్సర్లు ఉన్న బండ్లను ట్రాఫిక్  పోలీసులు సీజ్ చేసి కేబీఆర్ పార్క్ వద్ద అవగాహన కల్పించారు. హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్  ఆధ్వర్యంలో సైలెన్సర్లు మళ్లీ పనికి రాకుండా  రోడ్ రోలర్ తో తొక్కించారు. పట్టబుడ్డ బండ్లలో ఎక్కువగా  బుల్లెట్ బండ్లు, స్పోర్ట్స్ బండ్లు ఉన్నాయి. సౌండ్ పొల్యూషన్ కు కారణం అవుతున్న బండ్లు ఫస్ట్ టైమ్ పట్టుబడితే రూ.1000 ఫైన్, రెండోసారి పట్టుబడితే రూ.2 వేలు, మూడోసారి పట్టుబడితే వెహికల్ సీజ్ చేస్తున్న పోలీసులు. సౌండ్ పొల్యూషన్ కు కారణమవుతున్న బండ్ల హారన్ లు, సైలెన్సర్లు,వెహికల్స్ కి సౌండ్ తగ్గించి ఫిట్ చేయాలని స్పేర్ పార్ట్స్ డీలర్స్ కు , మెకానిక్ లకు  సూచించారు పోలీసులు. సౌండ్ పొల్యూషన్ నివారణకు ప్రతీ ఒక్కరు తగిన నియమాలు పాటించాలన్నారు.

మరిన్ని వార్తల కోసం

పోలీసులు కొట్టడం వల్లే చనిపోయిండు..

యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే