యాదాద్రిలో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ మృతి

యాదాద్రిలో దారుణం.. ఫారెస్ట్ ఆఫీసర్ మృతి

యాదాద్రి భూవనగిరి జిల్లాలో దారుణం జరిగింది. మహబూబ్ నగర్ కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి పోలీసులు కొట్టిన దెబ్బలకు తాలలేక చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ అటవీశాఖ కౌంటర్ అసిస్టెంట్  కార్తీక్ ఆదివారం స్వామి దర్శనానికి యాదాద్రికి వచ్చారు. ఘాట్ రోడ్డులో కార్తీక్ ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పోలీసులతో మాట్లాడుతుండగానే...లాఠీతో కొట్టినట్లు కార్తీక్ తన బాబాయ్ కు ఫోన్ లో వివరించిన ఆడియో ఉంది. ఐడీ కార్డ్ చూపించినా... పోలీసులు వదలేదని కార్తీక్ చెబుతున్నాడు. తిరుగు ప్రయాణంలో కార్తీక్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఉస్మానియాలో చేర్పించారు బంధువులు. ట్రీట్ మెంట్ తీసుకుంటు కార్తీక్ చనిపోయాడు. పోలీసులు కొట్టడంతోనే కార్తీక్ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో బంధువులు ఫిర్యాదు చేశారు. అతనికి ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని హోంగార్డు తీవ్రంగా కొట్టడం వల్లే అతను చనిపోయాడన్నారు. దీనిపై మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. దాడిచేసిన హోంగార్డుపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమానస్పద మృతిగా FIR చేసిన పోలీసులు... కేసును యాదాద్రి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

సౌండ్ చేశారో.. సైలెన్సర్ నలిగిపోద్ది..

యూపీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే