హైదరాబాద్ బండ్లగూడ సీఐ, ఎస్ఐ సస్పెండ్

హైదరాబాద్ బండ్లగూడ సీఐ, ఎస్ఐ సస్పెండ్

హైదరాబాద్ లోని బండ్ల గూడ సీఐ మొహమ్మద్ షాకిర్ అలీ,ఎస్ఐ  వెంకటేశ్వర్,  కానిస్టేబుల్ రమేష్ లను  హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.  ఓ మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్  కంప్లైంట్ విషయం లో ముగ్గురు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.  

కేసు దర్యాప్తులో అలసత్వం వహించారని మహిళా  కానిస్టేబుల్ ఫిర్యాదులో తెలిపారు.  విచారణ  జరిపిన  సీపీ కొత్త కోట  శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇటీవలే ఓ స్థిరాస్థి వ్యాపారి కేసులో గోపాలపురం సీఐ మురళీధర్, ఎస్ఐ దీక్షిత్ రెడ్డిని  సీపీ కొత్తకోట సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..

ALSO READ :- Vijay Devarakonda: క్లైమాక్స్ అంతా రక్తపాతమే.. ఫ్యామిలీ స్టార్ మూవీలో ఇదేం ట్విస్ట్!