Vijay Devarakonda: క్లైమాక్స్ అంతా రక్తపాతమే.. ఫ్యామిలీ స్టార్ మూవీలో ఇదేం ట్విస్ట్!

Vijay Devarakonda: క్లైమాక్స్ అంతా రక్తపాతమే.. ఫ్యామిలీ స్టార్ మూవీలో ఇదేం ట్విస్ట్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చాలా కాలంగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన గీత గోవిందం(GithaGovindam) సినిమా తరువాత ఇప్పటివరకు సరైన హిట్టు లేదు విజయ్ దేవరకొండకి. చాలా ఆశలు పెట్టుకున్న ఖుషీ కూడా సో సో రిజల్ట్ నే ఇచ్చింది. దాంతో.. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్ చూశాకా ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానుందని ఆడియన్స్ ఫీలవుతున్నారు. కానీ, విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ గురించి ఇటీవల చేసిన కామెంట్స్ కొత్త డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ కో హాజరయ్యారు విజయ్. ఇందులో భాగంగా అక్కడికి వచ్చిన ఒక నటి తన కుమారులకు లైగర్ సినిమా అంటే చాలా ఇష్టం అని, దానికి కారణం ఆ సినిమాలో ఉన్న వైలెన్స్ అని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా విజయ్ మాట్లాడుతూ.. అంటే ది ఫ్యామిలీ స్టార్ సినిమా చూడరా మరి.. అలా ఎం కాదులే.. ఈ సినిమా క్లైమాక్స్ లో మొత్తం రక్తపాతమే. మీకు నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. 

ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండటంతో.. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. సినిమా టైటిల్ ది ఫ్యామిలీ స్టార్ అని పెట్టి.. క్లైమాక్స్ లో రక్తపాతం ఏంటి కొండన్నా. ఎదో తేడాగా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారా. నిజానికి ది ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ చూసి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడాలని ఫిక్స్ అవుతున్నారు. ఆలా కాకుండా.. రక్తపాతం అనే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేస్తుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ALSO READ :- భార్యను సెకండ్ హ్యాండ్ అంటావా.. రూ.3 కోట్లు కట్టాలంటూ భర్తకు హైకోర్టు ఆదేశాలు