- ‘జీరో డిలే’ విధానాన్ని అమలు చేయాలి
- హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్రైమ్కంట్రోల్, లా అండ్ఆర్డర్పరిరక్షణలో పోలీస్ స్టేషన్లు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బుధవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మూడు పోలీస్కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ) ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది.
దీనికి సజ్జనార్అధ్యక్షత వహించగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు. క్రిమినల్స్ఒక కమిషనరేట్‌లో నేరం చేసి మరో చోటికి పరారవుతున్నారని, బార్డర్ల పేరుతో ఆలస్యం చేస్తే తప్పించుకునే అవకాశముంటుందన్నారు. కిందిస్థాయి సిబ్బంది మధ్య సమాచార మార్పిడి విషయంలో గ్యాప్ ఉండకుండా చూడాలన్నారు. నేరం ఎక్కడ జరిగినా సమీప పోలీసులు వెంటనే స్పందించేలా ఉండాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ట్రై కమిషనరేట్లు ఉమ్మడి నిఘా పెట్టాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవాలన్నారు.
ట్రాఫిక్ విషయంలోనూ..
భారీ వాహనాల ‘నో ఎంట్రీ’ సమయాలను ఒకేలా అమలు చేయాలని, పీక్ అవర్స్‌లో నగరం బయటే భారీ వాహనాలు ఆపాలన్నారు. వీకెండ్స్‌లో ఉమ్మడి డ్రంక్అండ్డ్రైవ్స్, పెండింగ్ చలాన్ల వసూలుకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దు జంక్షన్ల వద్ద సిగ్నల్ టైమింగ్స్‌లో రియల్ టైమ్ సమన్వయం, ప్రైవేట్ ట్రావెల్ బస్సుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.
