హెచ్‌‌సీఏ సమ్మర్ క్యాంప్స్‌‌ షురూ..రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో

హెచ్‌‌సీఏ సమ్మర్ క్యాంప్స్‌‌ షురూ..రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో
  •     3 వేల మందికి ఉచిత ట్రెయినింగ్ 
  •     ప్రతిభావంతులకు లీగ్స్‌‌లో ఆడే అవకాశం కల్పిస్తామన్న హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్ జగన్

 హైద‌‌రాబాద్‌‌, వెలుగు : హైద‌‌రాబాద్ క్రికెట్ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్‌‌‌‌ క్యాంప్స్‌‌ను షురూ చేసింది. శ‌‌నివారం హైద‌‌రాబాద్‌‌లోని లాలాపేట్ స‌‌మ్మర్‌‌‌‌ క్యాంప్‌‌ను హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్  జ‌‌గ‌‌న్‌‌మోహ‌‌న్‌‌రావు, సెక్రటరీ దేవరాజ్‌‌ లాంఛ‌‌నంగా ప్రారంభించగా, మ‌‌హ‌‌బూబ్‌‌న‌‌గ‌‌ర్‌‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌‌ను వైస్ ప్రెసిడెట్ ద‌‌ల్జిత్ సింగ్‌‌,జాయింట్ సెక్రటరీ బ‌‌స‌‌వ‌‌రాజు ఆరంభించారు. హెచ్‌‌సీఏ ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాల్లో తొలిసారిగా రాష్ట్ర మొత్తం ఏక‌‌కాలంలో సమ్మర్‌‌‌‌ ట్రెయినింగ్‌‌ క్యాంప్స్‌‌ ను మొదలు పెట్టామని జ‌‌గ‌‌న్‌‌ తెలిపారు.

క్యాంప్స్‌‌కు మంచి స్పంద‌‌న వ‌‌చ్చింద‌‌ని, ఇందులో మూడు వేల మందికి రిజిస్టర్‌‌‌‌ చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్యాంప్స్‌‌ ద్వారా అన్ని ప్రాంతాల్లో టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించి ఫ్యూచర్‌‌‌‌లో హెచ్‌‌సీఏ లీగ్స్‌‌లో అవకాశం కల్పిస్తామన్నారు. 29 సెంటర్లలో క్యాంప్స్‌‌లో పాల్గొన్న వారి వివరాలను డిజిటలైజ్ చేసి హెచ్‌‌సీఏ వెబ్‌‌సైట్‌‌లో నిక్షిప్తం చేయ‌‌నున్నామ‌‌ని, క్యాంప్స్‌‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు.  వ‌‌చ్చే ఏడాది 10 వేల మంది క్రికెట‌‌ర్లతో సమ్మర్ క్యాంప్స్ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తామని  జగన్ తెలిపారు.