
హైదరాబాద్: అంపైరింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఈ నెల 23న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ట్రెయినింగ్ ఇవ్వనుంది. ఆ తర్వాతి రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తారు. హెచ్‌సీఏలో నమోదు చేసుకోని వారు కూడా ఈ సెషన్‌లో పాల్గొనవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్ కాపీతో పాటు ఓ రిక్వెస్ట్ లెటర్‌ను ఈ నెల 21 సాయంత్రం 5 గంటల్లోగా హెచ్‌సీఏకు సమర్పించాలి. మిగతా వివరాలకు కుశా ప్రకాశ్ (9848250727)ను సంప్రదించవచ్చని హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్. దేవరాజ్ తెలిపారు.