
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గతేడాదితో పోలిస్తే సైబర్‌నేరాలు 48 శాతం పెరిగాయని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం తన ఆఫీస్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకౌంట్ఓపెనింగ్, హెల్ప్ డెస్క్ నిర్వహణ, మనీ ట్రాన్సాక్షన్స్తదితర వివరాలను అడిగారు. లేట్, టైమ్ అవుట్ లావాదేవీల్లో బాధితుల కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు, రీఫండ్ పై చర్చించారు. సైబర్ఫ్రాడ్స్ను గుర్తించేందుకు ఒక వాట్సాప్ గ్రూప్క్రియేట్చేయాలని నిర్ణయించారు. 27 బ్యాంకుల అధికారులు, సైబర్ క్రైం పోలీసులు పాల్గొన్నారు.