స్కూళ్లలోని పనుల నివేదిక ఇవ్వండి : అనుదీప్

స్కూళ్లలోని పనుల నివేదిక ఇవ్వండి : అనుదీప్

హైదరాబాద్, వెలుగు :  వారం రోజుల్లోగా ప్రభుత్వ బడుల్లో చేపట్టిన మౌలిక వసతుల పనుల రిపోర్డు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 562 ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కోసం ప్రభుత్వం రూ.30.63 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, హెచ్ఎం, ఏఈ /డీఈ లు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి ఫైనల్ ఎస్టిమేట్ ఇవ్వాలని ఆదేశించారు. ఏప్రిల్ 4న వర్క్ షాప్ నిర్వహించి కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, పీ.కదిరవన్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, టీఎస్ ఈడబ్ల్యూఐడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షఫీ మియా, టీఎస్ ఎమ్మెస్ ఐడీసీ ఈఈ చలపతిరావు, టీఎస్ ఈఆర్ఐసీ ఈఈ విభన్ కుమార్, కంటోన్మెంట్ బోర్డ్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఫణి కుమార్, టీఎల్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్​ సమావేశమయ్యారు. వడదెబ్బ నుంచి రక్షించుకుందాం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఆరోగ్య కేంద్రాల్లో  సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచాలని ఆదేశించారు. 

శిక్షణ కేంద్రాలు పరిశీలన

పీఓ, ఏపీఓలకు ఇబ్రహీంబాగ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో, మలక్ పేట, ఉస్మానియా యూనివర్సిటీ, కోఠిలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాలను కలెక్టర్​అనుదీప్​ సందర్శించారు. గైర్హాజరైన వారిని గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఏఆర్ఓ జ్యోతిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.