
హైదరాబాద్లోని బంజారాభవన్లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 15 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు కూడా హాజరయ్యారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు పాటించాల్సిన రూల్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. 35 వేల సిబ్బంది, 3 వేల 986 పోలింగ్ కేంద్రాలను హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామని -రోనాల్డ్ రాస్ చెప్పారు.
మరోవైపు... ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. చాలా చోట్ల బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా పట్టుబడుతోంది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న గోల్డ్, నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ వారం రోజుల్లో రాష్ట్రంలో రూ.100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.