
- ట్రేడ్ లైసెన్స్ రద్దుకువ్యవసాయ శాఖకు సిఫార్సు
- ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడి
ఖమ్మం, వెలుగు: రైతులకు యూరియాతో పాటు ఇతర ఎరువులు, పురుగుల మందు డబ్బాలు కొనుగోలు చేయాలని కండీషన్ల పెట్టే దుకాణాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు బుధవారం నేలకొండపల్లి, చింతకాని, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలాల్లోని ఎరువుల షాపుల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.
రైతులకు యూరియాతో పాటు ఇతర బయోస్టిమ్యులెంట్ ట్యాగ్ చేసి యూరియాను అమ్ముతున్నట్టు గుర్తించారు. నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు, ట్రేడ్ లైసెన్స్ రద్దుకు వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసినట్లు ఖమ్మం పోలీస్‌కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. యూరియా కొనుగోలు సమయంలో దుకాణదారులు ఏవైనా షరతులు పెడితే వెంటనే స్థానిక పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు రైతులు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.