GHAATI: అనుష్క-క్రిష్‌‌‌‌‌‌‌‌ కాంబోపై భారీ హైప్.. పాటలతోనే ఘాటీ ప్రపంచం కళ్లముందు..

GHAATI: అనుష్క-క్రిష్‌‌‌‌‌‌‌‌ కాంబోపై భారీ హైప్.. పాటలతోనే ఘాటీ ప్రపంచం కళ్లముందు..

అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో క్రిష్‌‌‌‌‌‌‌‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఘాటి’.యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్‌ బ్యానర్‌‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ‘దస్సోరా’అనే పాటను విడుదల చేశారు. సాగర్ నాగవెల్లి కంపోజ్ చేసిన ఈ ఎనర్జిటిక్‌ సాంగ్‌ను గీతా మాధురి, సాకేత్, శృతి రంజనీ పాడారు. ఇపుడు ఈ పాట శ్రోతలను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. క్రిష్ గత సినిమాల తాలూకు విలువలను చెబుతుందని ఆడియన్స్ కామెంట్స్ ప్పెడుతున్నారు. అలాగే, ఇందులోని లిరిక్స్ ఘాటీల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాస్తవాన్ని హైలెట్ చేశాయని ట్వీట్స్ పెడుతున్నారు. 

‘‘దస్సోరా దస్సోరా.. తూరుపు కనుమల నడుమింటి కారడువుల్లో కాలెట్టి,  సిరుతై ఉరికే యమజట్టి.. వేటకు కదిలే ఘాటీ.. కాసే కళ్లలో దుమ్మెట్టి.. గుండెల నిండా దమ్ము అట్టి.. దుమికే దుప్పికి పోటీ.. జరజర జారే ఘాటీ..” అంటూ ఈఎస్‌‌‌‌‌‌‌‌ మూర్తి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ కు ముందే ఘాటీల జీవన శైలి, వాళ్ల సంస్కృతి, పట్టుదల, ఎలా ఉంటుందో చక్కగా ఈ పాట ద్వారా వివరించారు.

మొదటి పాట ‘సైలోరే.. లొల్లాయి’సైతం ఆడియన్స్ను వీపరీతంగా ఆకట్టుకుంది. ‘సైలోరే.. లొల్లాయి లొల్లాయి లోరే.. పుట్టగానే బెమ్మ ముడిపెట్టెరో.. వయసు తాకి జంట కట్టెరో.. బతుకునంతా తోడులోన చూసేరో.. అడుగు అడుగు మొదలు పెట్టెరో..’ అంటూ సాగే ఈ ఫోక్ వెడ్డింగ్ సాంగ్‌‌ను సాగర్ నాగవెల్లి కంపోజ్ చేయగా, క్రిష్ జాగర్లమూడి ఆకట్టుకునే లిరిక్స్ అందించారు. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెల్లి, సోని  కోమండూరి కలిసి పాడిన తీరు ఇంప్రెస్ చేసింది. ఇందులో అనుష్క, విక్రమ్ కొత్తగా పెళ్లయిన జంటగా కనిపించారు.

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ‘వేదం’తర్వాత అనుష్క, క్రిష్‌‌ కాంబినేషన్‌‌లో వస్తోన్న రెండో సినిమా కావడం, అలాగే యూవీ క్రియేషన్స్‌‌తో అనుష్కకు ఇది నాలుగో సినిమా అవడంతో అంచనాలు ఏర్పడ్డాయి. చైతన్య రావు, రవీంద్రన్ విజయ్, జగపతి బాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీనివాసరావు కథను అందించగా, సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.