మరింత యాక్టివ్ గా నిఘా బృందాలు : రోనాల్డ్ రాస్

మరింత యాక్టివ్ గా నిఘా బృందాలు : రోనాల్డ్ రాస్

హైదరాబాద్, వెలుగు : నిఘా బృందాలు శుక్రవారం నుంచి మరింత యాక్టివ్ గా ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఇప్పటికే జిల్లాలో నగదు, బంగారం  ఆభరణాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు  ఫ్లయింగ్ స్క్వాడ్ లు, పోలీస్ శాఖ తనిఖీలకు 18 చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో  రూ. 45 కోట్ల 89 లక్షల విలువైన సొత్తును పట్టుకున్నామన్నారు.

జిల్లా లోని 15 నియోజకవర్గాల్లో నామినేషన్లు ప్రారంభమవుతుండగా స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్ లను  సెగ్మెంట్లకు 9 బృందాలను నియమించామని, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని నగదు, ఆభరణాలు  సీజ్ చేసిన వాటిని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఫిర్యాదుల కమిటీ ద్వారా వెంటనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.