హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక.. క్వాంటం ఎకానమీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక.. క్వాంటం ఎకానమీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • రూ.వెయ్యి కోట్లతో యువ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: డిప్యూటీ సీఎం భట్టి
  • దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెక్నాలజీకి ప్రత్యేక రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 2047 నాటికి 3 ట్రిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని వెల్లడి
  • గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో నీతి ఆయోగ్ సమావేశం

హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తు ‘క్వాంటం ఎకానమీ’కి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్ర బిందువుగా(లీడర్) నిలవనుందని.. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైపుణ్యం వంటి వనరులన్నీ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. క్వాంటం టెక్నాలజీ కోసం ప్రత్యేక రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించిన దేశంలోని తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఆయన వెల్లడించారు. ఈ రంగంలో స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రోత్సహించేందుకు రూ.1,000 కోట్లతో ‘యువ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 

గురువారం ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలిలో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్​ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ ఆవిష్కరణ సమావేశంలో మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏ ఇతర సాంకేతికత తీసుకురానంత వేగంగా.. క్వాంటం టెక్నాలజీ అన్ని రంగాల్లో మార్పులు తీసుకురాబోతోందని తెలిపారు. 

దేశ భవిష్యత్తు, జాతీయ భద్రత, ఆర్థికాభివృద్ధిని ఇది ప్రభావితం చేయనుందన్నారు. గొప్ప భవిష్యత్తును కోరుకునే ఏ దేశానికైనా క్వాంటం వ్యూహం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. జాతీయ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానంగా ‘తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ’ని రూపొందించామని డిప్యూటీ సీఎం వివరించారు. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, విద్య, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ వంటి రంగాల్లో భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్యాలను ఇది సాధిస్తుందన్నారు. 

కేవలం వ్యూహరచనకే పరిమితం కాకుండా, అమలు కోసం స్పష్టమైన రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరిస్తున్నామన్నారు. నేడు క్వాంటం టెక్నాలజీ భారత ఆర్థిక వృద్ధికి, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణకు కీలకం కానుందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్ మ్యాప్ ఉందని తెలిపారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం భాగస్వాములుగా బలమైన ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మిస్తామన్నారు. 

 క్వాంటం సిటీగా హైదరాబాద్ : శ్రీధర్​ బాబు

హైదరాబాద్​ను క్వాంటం సిటీగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు. క్వాంటం టెక్నాలజీలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీని రూపొందించామని చెప్పారు. 

రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నదని చెప్పారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర అధునాతన సాంకేతికతల్లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీలో భాగంగా రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే డైరెక్షన్ అని పేర్కొన్నారు.  కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, మెంబర్ డా. వీకే సారస్వత్, దేబయాని ఘోష్, స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.