
కటక్: రంజీ ట్రోఫీలో భాగంగా చండీగఢ్‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ బాగా ఆడుతోంది. పేసర్ రక్షణ్ రెడ్డి (4/55) సత్తా చాటడంతో రెండో రోజు, శుక్రవారం పైచేయి సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 270/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 347 వద్ద ఆలౌటైంది. తనయ్ (38), మికిల్(24)తో పాటు సీవీ మిలింద్ (28), రక్షణ్ రెడ్డి (12 నాటౌట్) విలువైన రన్స్ అందించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన చండీగఢ్ రెండో రోజు చివరకు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 200/6 స్కోరు చేసింది. కెప్టెన్ మనన్ వోహ్రా (110) సెంచరీ కొట్టాడు. హైదరాబాద్ బౌలర్లు కుదురుకోనివ్వలేదు. రక్షణ్ నాలుగు, స్పిన్నర్ తనయ్ (2/61) రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం రాజ్ బవా (39 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. హైదరాబాద్ స్కోరుకు చండీగఢ్ ఇంకా 147 రన్స్ దూరంలో నిలిచింది.