Weather News : ఉదయం చలికాలం.. మధ్యాహ్నం ఎండాకాలం

Weather News : ఉదయం చలికాలం.. మధ్యాహ్నం ఎండాకాలం

తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా ఉదయం సమయాల్లో చలి తీవ్రత పెరిగగా.. మధ్యాహ్న వేళలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో వేసవికాలనికి ముందు ఫ్రిబవరి నెలలో ఉదయం వేళలో చలికాలంగా, మధ్యాహ్నం వేళలో ఎండకాలంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  రాత్రి నుంచి తెల్లవారుజాము సూర్యోదయం సమాయానికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. మళ్లీ ఉదయం 9 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వడగాలులు వీస్తూ సమ్మర్ ను తలిపిస్తోంది.

ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) అంచనా ప్రకారం.. హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజులు ఉదయం సమయాలలో చలి ఎక్కువగా ఉండనుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగనున్నట్లు తెలిపింది. 

నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి పగటిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వెల్లడించింది.  

హైదరాబాద్ నగరంలో ప్రతి ఏడాది  సగటున,  ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రత 31.8°C,  రాత్రి ఉష్ణోగ్రతలు 15.5°C నమోదవుతాయి. అయితే, ఈ సంవత్సరం, ఇఎల్ నినో కారణంగా హైదరాబాద్‌లో వేసవి ప్రారంభంలో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళలో 18 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణగ్రతలు పడిపోతుండగా.. మధ్యాహ్నం వేళలో 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి.