హైదరాబాద్లో 37%  లోటు వర్షపాతం ..పదేండ్లలో ఈ సారే అత్యంత తక్కువ వర్షం 

హైదరాబాద్లో 37%  లోటు వర్షపాతం ..పదేండ్లలో ఈ సారే అత్యంత తక్కువ వర్షం 
  • మేడ్చల్‌‌‌‌‌‌‌‌లో 41%,  రంగారెడ్డిలో 25%  లోటు 
  • ఎల్​నినో ఎఫెక్ట్​తో భారీగా తగ్గిన వానలు 
  • అడుగంటుతున్న అండర్​ గ్రౌండ్​ వాటర్​
  • తాగునీటికి ముప్పుందన్న వాటర్​బోర్డు   
  •  

హైదరాబాద్ సిటీ,  వెలుగు : ​ఎల్​నినో సిటీపై పంజా విసిరింది. దీని ఎఫెక్ట్​ ఎంతలా ఉందంటే గత పదేం డ్లలో క్యూర్​ పరిధిలో ఎన్నడూ లేనంత లోటు వర్షపాతం నమోదైంది. అక్టోబర్​ నాటికి సాధారణం కంటే చాలా తక్కువ నమోదు కావడంతో గ్రౌండ్​ వాటర్​ దారుణంగా పడిపోతున్నది. గతేడాది సిటీలో ఫుల్లు వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండగా.. ఈ సారి వర్షాలు లేక విలవిల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది.  హైదరాబాద్ జిల్లాలో అక్టోబర్ ​2 నాటికి 72.57 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా,  45.85 సెం.మీ మాత్రమే పడింది. ఇది ​ 37 శాతం లోటు కాగా, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఏకంగా 41 శాతం, రంగారెడ్డి జిల్లాలో 25 శాతం లోటు నమోదైంది. ఈ నెల 27 నుంచి ఆర్నబ్​ తుఫాను ప్రభావంతో హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినా ..దీనితో పెద్దగా ఒరిగేది లేదని నిపుణులు చెప్తున్నారు.  

గతేడాది భారీ వానలు 

హైదరాబాద్​ జిల్లాలో వర్షాకాలం సీజన్​లో సాధారణ వర్షపాతం 59.48 సెం.మీ కాగా..2023లో 80 నుంచి 85 సెం.మీ కురిసింది. 2024లో ఏకంగా 92.70 సెంటీమీటర్లు, 2025లో 90.78 సెంటీమీటర్ల వాన పడింది. ఇది సాధారణం కంటే సుమారు 53 శాతం అదనం.  ఖైరతాబాద్, నాంపల్లి వంటి ప్రాంతాల్లో దాదాపు 94.80 సెంటీమీటర్లు కురిసింది.  

మేడ్చల్​ జిల్లాలో 41 శాతం లోటు 

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 86.20 సెం.మీ కాగా, 2025లో 126.20 సెం.మీ కురిసింది. ఇది సాధారణం కంటే దాదాపు 46 శాతం ఎక్కువ. కానీ, ఏడాది తిరిగే లోపు ఎల్​నినో దెబ్బకు ఈసారి 41 శాతం లోటు నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో సాధారణంగా 80 నుంచి 85 సెం.మీ కురవాల్సి ఉండగా, 2025లో  100 నుంచి 115 సెం.మీ పడింది. ఇది సాధారణం కంటే 30 నుంచి 35 శాతం పైగా ఎక్కువ. కానీ, ఈసారి 25 శాతం లోటు నమోదైంది. 

అతి తక్కువ మారేడ్​పల్లి మండలంలోనే.. 

హైదరాబాద్​ జిల్లా పరిధిలోని ఈసారి అన్నింటికంటే ఎక్కువగా మారేడ్‌‌పల్లి మండలంలో అత్యంత తక్కు వ వర్షపాతం నమోదైంది. ఇక్కడ కురవాల్సిన వర్షం కంటే 45 శాతానికి పైగా లోటు ఉంది. తర్వాత  సికింద్రాబాద్​లో 42 శాతం, ఆసిఫ్‌‌నగర్​లో 40 శాతం, బహదూర్‌‌పురాలో 38 శాతం లోటు ఉంది. మేడ్చల్ పరిధిలోని మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోనూ సాధారణం కంటే చాలా తక్కువగానే వర్షాలు పడ్డాయి. 

 నీళ్లకు, కరెంట్​కు  గోసే..

లోటు వర్షపాతంతో సిటీకి తాగునీరందించే ప్రధాన జలాశయాలైన ఉస్మాన్‌‌సాగర్, హిమాయత్‌‌సాగర్, సింగూరుల్లో నీటిమట్టం ఆశాజనకంగా లేకపోవడంతో రాబోయే రోజుల్లో నగరవాసులకు నీటి కోసం తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే దీంతో తీవ్ర జనసాంద్రత ఉండే వెస్ట్​ సిటీతో పాటు సిటీలోని బస్తీల్లో  నీటి కోసం కష్టాలు పడుతున్నారు. భూగర్భ జలాలు దారుణంగా పడిపోయి బోర్‌‌వెల్స్ ఎండిపోతుండడంతో ఇప్పటికే అపార్ట్‌‌మెంట్ల నుంచి మొదలుకుంటే హాస్టల్స్​, ఆఫీసుల్లో అంతా నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. డిసెంబర్ 15 వరకే నీటి నిల్వలు ఉన్నాయని, నీళ్లను పొదుపుగా వాడుకోవాలని వాటర్​ బోర్డు ప్రచారం చేస్తోంది. కార్లు, బైకులు, ఇంటి బయట కడుగుతూ రోడ్లపైకి నీటిని వదిలితే జరిమానా తప్పదని హెచ్చరిస్తోంది.

మరోవైపు జల విద్యుత్​ఉత్పత్తి తక్కువవుతుండడంతో కరెంట్​సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. వర్షాలు లేక జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతుండడంతో జల విద్యుత్ కోసం వాడే పరిస్థితి లేదు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తిని తగ్గించారు కూడా. గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 4 వేల మెగావాట్ల మేర ప్రొడక్షన్​ తగ్గిపోయింది.  దీంతో కరెంట్​ను కూడా పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

‘ఆర్నబ్’​తో మారేది ఏమీ లేదు  

‘అర్నబ్’ తుఫాను ప్రభావంతో  ఈ నెల 27 నుంచి ​వర్షాల కురుస్తాయని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో సిటీ జనాలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో నాన్-స్టాప్ ముసురు లేదా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్​ ఉందనడంతో ఎల్​నినో ఎఫెక్ట్​ తగ్గుతుందని అనుకుంటున్నారు. కానీ, వర్షం 2 నుంచి 5 సెం.మీ వరకే పడొచ్చని, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు. ఈ వర్షం డ్రైనేజీలు, నాలాల్లో కొట్టుకుపోతుందని, భూమిలోకి ఇంకడానికి, లేదా భూగర్భ జలాలు పెరిగి లోటును తగ్గించే ఛాన్స్​ లేదంటున్నారు. తుఫాను తూర్పు వైపు కేంద్రీకృతమై ఉండటం వల్ల రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం లేదంటున్నారు. కేవలం పొడి వాతావరణం నుంచి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుందని చెప్తున్నారు.