
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. రాబోయే రెండు రోజులపాటు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ క్రమంలో జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జూన్ 27, 28 తేదీల్లో హైదరాబాద్ సిటీలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. జూన్ 26వ తేదీ బుధవారం సాయంత్రం నుంచి జూన్ 29వ తేదీ మధ్య వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు తెలంగాణలో సాయంత్రం నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని తెలిపింది.
జూన్ నెలలో నైరుతి రుతుపవనాల తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. రాష్ట్రం మొత్తం మీద ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. హైదరాబాద్ విషయానికొస్తే 33 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోయాయి. రాష్ట్రంలో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గనున్నాయి.