రేపటి భవిష్యత్ నగరమే.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ .. రావిర్యాల ఈ సిటీ సభలో సీఎం

రేపటి భవిష్యత్ నగరమే.. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ .. రావిర్యాల ఈ సిటీ సభలో సీఎం


 తెలంగాణ రావిర్యాల ఈ సిటీలో  లో  సీఎం రేవంత ప్లూయిడ్స్​ యూనిట్​ ను ప్రారంభించారు.  ఈ సభలో ఆయన మాట్లాడుతూ రేపటి భవిష్యత్​ నగరమే.. హైదరాబాద్​ ఫ్యూచర్​ సిటీ  అని తెలిపారు.  సుజన మెడికల్​ కేర్​ ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.  

తెలుగురాష్ట్రాల సమస్యలపై స్పందించిన సీఎం రేవంత్​ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  తాము కూడా అమరావతి అభివృద్దిని కోరుకుంటున్నమన్నారు.

ప్రపంచ నగరాలతో హైదరాబాద్​ పోటీ పడుతుందన్న సీఎం...  మాకు వివాదాలు మఖ్యం కాదు.. పరిష్కారాలే ముఖ్యమన్నారు.  పొరుగు రాష్ట్రాలతో చర్చలకు సిద్దంగా ఉన్నానని తెలిపారు.  ప్రంపంచ దేశాలతో హైదరాబాద్​ పోటీపడుతుందన్నారు. ఇందులో 30 ఏళ్ల శ్రమ ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి తెలంగాణ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందన్నారు.  ఫార్మారంగంలో ప్రపంచ దేశాలు హైదరాబాద్​ వైపు చూస్తున్నాయన్నారు. పాలసీ పెరాల్సిస్​ లేకుండా విధానాలను రూపొందిస్తున్నామన్నారు.