హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ భారీ గణనాథుడి శోభాయాత్రకు పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకోబోతున్నారు. ట్రాఫిక్, లా ఎండ్ ఆర్డర్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జనం జరిగే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఖైరతాబాద్ బడా గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ట్రాఫిక్ అడ్వైజరీని సిటీ ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేశారు. 

Also Read :- గణేష్ నిమజ్జన పూజా విధానం ఇదే...

ఖైరతాబాద్ గణేష్ కు పరిసరల్లో వీవీ స్టాట్యూ, షాధన్ నిరంకారి, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, అయోధ్య ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లై జుంక్షన్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోటరీ వద్ద ట్రాఫిక్ కాంజేషన్ ఉంటుందని వివరించారు.

1. వీవీ స్టాట్యూ టూ షాధన్ నిరంకారి..
2. షాధన్ నిరంకారి టూ వీవీ స్టాట్యూ..
3. వీవీ స్టాట్యూ టూ నెక్లెస్ రోటరీ..

నగర వాసులు 28వ తేదీ మధ్యాహ్నం 3 నుండి రాత్రి 11 గంటల వరకు ఈ మార్గాల్లో ప్రయాణాలు చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు కోరారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైతం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. ఐడీఎల్ ట్యాంక్ ఎంట్రన్స్ నుంచి రైన్ బో విస్తా టీ జంక్షన్ వరకు రోడ్డును మూసివేస్తామని పేర్కొన్నారు. కూకట్ పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వచ్చే వాహనాలు జేఎన్టీయూ, ఫోరమ్ మాల్ మీదుగా వెళ్లాలని చెప్పారు.

బోయిన్ పల్లి, సికింద్రాబాద్ లోని ఇతర కాలనీల నుండి వచ్చే వాహనాలు అంజయ్య నగర్ మీదుగా వెళ్లాలని ఆదేశించారు. విగ్రహాలతో వెళ్లే వాహనాలను ఫతే నగర్, హైటెక్ సిటీ, ఫోరమ్ మాల్, బాలానగర్, ఖైత్ లాపూర్ ఫ్లై ఓవర్ లపై అనుమతిస్తామని తెలిపారు.